Reading Time: < 1 minute
Bus Fire Accident Sleeper Bus Catches Fire On Nh 30 In Madhya Pradesh Passengers Jump Out To Safety

Bus Fire Accident: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మైహర్ జిల్లాలో NH–30పై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మంటకు క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే మంటలు వ్యాపించగానే ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బస్సు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం.

Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

ఇక అందిన వివరాల ప్రకారం.. జై భవాని ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు (MP 30 P 7070) మార్చి 9న రీవా నుంచి ఇండోర్‌ కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కట్నీ సమీపంలో బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో డ్రైవర్ మెకానిక్‌ సహాయంతో మరమ్మతులు చేయించుకున్న తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును తిరిగి రీవాకు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో నదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేడా గ్రామం దగ్గర బస్సు ముందుభాగం నుంచి అకస్మాత్తుగా పొగ వచ్చి ఆ తర్వాత మంట రావడం ప్రారంభమైంది.

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

ఘటనపై బస్సు కండక్టర్ రుద్ర సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. బోనెట్ నుంచి పొగ, మంట కనిపించగానే డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ గాలి వేగం కారణంగా మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని ఆవరించాయి. ఈ గందరగోళంలో బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే నదన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రేణు మిశ్రా పోలీస్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రత దృష్ట్యా కొంతసేపు హైవే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కొద్దీ సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు ఎందుకు చెలరేగాయన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.