July 9, 2026

IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..

IndiGo CEO Resigns: ఇండిగో సీఈఓ రాజీనామా..
Reading Time: < 1 minute
Indigo Ceo Pieter Elbers Resigns Rahul Bhatia Interim Charge

IndiGo CEO Resigns: ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్‌లో ఇండిగో సంక్షోభం ఎదురైంది. ఇండిగో దారుణమైన ఆపరేషనల్ ఫెయిల్యూర్ తర్వాత కేంద్రం ఇండిగోపై కన్నెర్ర చేసింది. ఆ సమయంలోనే సీఈఓ రాజీనామాను పౌరవిమానయాన శాఖ కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత, రాహుల్ భాటియా తాత్కాలికంగా కంపెనీ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భాటియా తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని ఎయిర్‌లైన్ ధృవీకరించింది.

గతేడాది డిసెంబర్‌ 3-5 తేదీల మధ్య ఏకంగా 2507 విమానాలను ఇండిగో క్యాన్సిల్ చేసింది, 1852 సర్వీసుల్ని ఆలస్యం మచేసింది. దీని వల్ల దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. పైలట్స్ FDTL నిబంధనలను అమలు చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.

ఈ పరిణామాల తర్వాత ఇండిగో షెడ్యూల్‌ను 10 శాతం తగ్గించింది. డీజీసీఏ జనవరి 17, 2026న, రూ.22 కోట్లకు పైగా జరిమానాలు విధించింది. ఎల్బర్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. సేవల మెరుగుదల నిర్ధారించడానికి రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ అందించాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించింది.