Reading Time: < 1 minute
Nandi Idol Damaged At Bhimavaram Pancharama Kshetram In West Godavari

Nandi Idol Damaged: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమవరం పంచారామంలో అపచారం చోటు చేసుకుంది.. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పురాతన నందీశ్వరుడు విగ్రహం తల భాగాన్ని వేరు చేయడంతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. పుష్కరిణి వద్ద నుంచి విగ్రహాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించినట్టుగా ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ఘన చరిత్ర ఉన్న పంచారామ క్షేత్ర ఆలయానికి సంబంధించిన నంది విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులకు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ స్వయంగా ఘటన స్థలాన్ని చేరుకుని సానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Read Also: Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండాలంటే సింపుల్‌ చిట్కా..!