Reading Time: < 1 minute

మేడ్చల్లో ఖాళీ కుండలు, బిందెలతో ధర్నా

Caption of Image.

మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణవాసులు ధర్నాకు దిగారు. కాలనీల నుంచి ఖాళీ కుండలు, బిందెలతో ర్యాలీగా వచ్చి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించారు. కుండలు, బిందెలను రోడ్డుపై పగలగొట్టారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సుధాంశు కాళ్ల మీద పడి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పట్టణ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్ మొరపెట్టుకున్నాడు. వారానికి ఒకసారి నీళ్లు వస్తాయని, త్వరగా సమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డి నాయకత్వంలో జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
 

©️ VIL Media Pvt Ltd.