Reading Time: 2 minutes
విజయ్-రష్మికల రిసెప్షన్‌లో ఎన్టీఆర్ డూప్‌ను బన్నీ బౌన్సర్లు నెట్టేశారా? వీడియో రిలీజ్ చేసిన ఈశ్వర్

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ల జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో వీరి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, కొందరు సినీ ప్రముఖుల మాత్రమే వచ్చారుఅయితే ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు విజయ్- రష్మిక దంపతులు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా సినీ ఇండస్ట్రీలోని స్టార్ క్యాస్టింగ్ మాత్రమే కాకుండా.. విజయ్, రష్మిక తమకు పరిచయం ఉన్న అనేక మంది జూనియర్ ఆర్టిస్టులను కూడా రిసెప్షన్ కు ఆహ్వానించడం విశేషం. అందులో సోషల్ మీడియాలో హైలైట్ అయిన వారిలో ఒకరు ఈశ్వర్ కూడా ఉన్నాడు. ఈ పేరు వింటే చాలా మందికి అతను గుర్తుకు రాకపోవచ్చు. కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు డూప్ అంటే ఇట్టే గుర్తు పడతారు.

తారక్ డూప్ కు విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆహ్వానం అందగా.. వెళ్లి కొత్త జంటకు విషెస్ చెప్పి ఫొటోలు, వీడియోలు దిగారు. కానీ ఆ ఫొటోలు, వీడియోల కన్నా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అయింది. అందులో అల్లు అర్జున్ బౌన్సర్లు.. ఈశ్వర్ ను పక్కకు నెడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అసలేం జరిగిందోనని, అక్కడ తారక్ డూప్ ఏం చేశాడోనని నెటిజ్లు మాట్లాడుకుంటున్నారు. దీనిపై ఇప్పుడు ఈశ్వర్ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజు జరిగినది చాలా చిన్న విషయమని, కానీ నెట్టింట అదొక పెద్ద విషయంగా వైరల చేస్తున్నారంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

విజయ్, రష్మికలతో ఎన్టీఆర్ డూప్ ఈశ్వర్..

 

 

View this post on Instagram

 

A post shared by Eshwar Harris (@eshwarharris_1)

 

View this post on Instagram

 

A post shared by Eshwar Harris (@eshwarharris_1)

క్లారిటీ ఇచ్చిన ఈశ్వర్ హారిస్.. వీడియో ఇదిగో..

 

View this post on Instagram

 

A post shared by Eshwar Harris (@eshwarharris_1)

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.