Reading Time: < 1 minute
Kalvakuntla Kavitha Arrested During Hunger Strike In Khammam Case Filed Against 33 Supporters

Kavitha Arrest: వెలుగుమట్ల భూ బాధితులకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిన్న (సోమవారం) రాత్రి పునరావస కేంద్రంలో దీక్షకు కూర్చున్న జాగృతి అధినేత కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల వద్ద ఉన్న భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్న వారిని గత నెల 24 తారీఖున పోలీసులు తొలగించారు. అయితే ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వచ్చి పరామర్శించగా.. నిన్న జాగృతి అధినేత కవిత పునరావాస బాధితులని పరామర్శించి వారితో అంబేద్కర్ విగ్రహం వద్ద నాలుగున్నర గంటల పాటు ధర్నా నిర్వహించింది.

Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత తిరిగి మళ్ళీ రాత్రి పునరావాస కేంద్రంలో కవిత తన నిరాహార దీక్షను చేపట్టింది. నిరాహారదీక్ష చేపట్టడంతో నేడు (మంగళవారం) తెల్లవారు జామున పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మరో 33 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కల్పించినందుకు కేసు నమోదు చేశారు.

Storyboard: బిహార్‌లో బీజేపీ మార్క్ పాలిటిక్స్? నితీష్‌ను రాజ్యసభకు పంపడం వెనుకున్న ప్లాన్ ఏంటి..?