Reading Time: < 1 minute
Karur Stampede Cbi Summons Tvk Chief Vijay

తమిళనాడు ఎన్నికల వేళ టీవీకే అధినేత, హీరో విజయ్‌కు ట్విస్ట్ చోటుచేసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో రేపే (10-03-2026) విచారణకు రావాలంటూ తాజాగా విజయ్‌కు సీబీఐ నోటీసు జారీ చేసింది.

కరూర్ తొక్కిసలాట ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటికే జనవరి 12, 19 తేదీల్లో రెండు సార్లు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి విజయ్ వెళ్లారు. అయితే తాజాగా సేకరించిన సమాచారం మేరకు మరోసారి విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసు ఇచ్చింది.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ కరూర్‌లో సభ నిర్వహించారు. అయితే భారీ ఎత్తున ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే సభ నిర్వహణలో మేనేజ్‌మెంట్ లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన అనేక మంది నేతలను అధికారులు విచారించారు. అలాగే విజయ్‌ను కూడా రెండు సార్లు విచారించారు. అయితే తాజాగా సేకరించిన సమాచారం మేరకు విచారణ చేయాల్సి ఉందని సీబీఐ నోటీసులో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Jaishankar: పశ్చిమాసియా యుద్ధంపై జైశంకర్ కీలక ప్రకటన