Reading Time: < 1 minute

గాయపడ్డ సింహం మూవీ నుంచి ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

Caption of Image.

తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. అమెరికా వెళ్లాలనుకున్న  హీరో డ్రీమ్ ఎలా ఆగమయ్యిందో  చూపిస్తూ సాగిన పాట ఫన్నీగా ఉంది. 

మ్యూజిక్ డైరెక్టర్  స్వీకర్ అగస్తీ  కంపోజ్ చేయడంతోపాటు తనే లిరిక్స్ కూడా అందిస్తూ స్వయంగా పాడిన తీరు ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్, విష్ణు ఓయి తమదైన ఫన్నీ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌తో మెప్పించారు. మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.