July 8, 2026

సరస్వతి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తోంది.. ప్రతి సీన్‎కు ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నరు: వరలక్ష్మి శరత్ కుమార్

సరస్వతి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తోంది.. ప్రతి సీన్‎కు ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నరు: వరలక్ష్మి శరత్ కుమార్
Reading Time: < 1 minute

సరస్వతి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తోంది.. ప్రతి సీన్‎కు ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నరు: వరలక్ష్మి శరత్ కుమార్

Caption of Image.

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి దోస డైరీస్‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్మించిన చిత్రం ‘సరస్వతి’. మార్చి 6న  థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్  రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌తో  సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా  రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.

ఈ వేడుకలో  వరలక్ష్మి మాట్లాడుతూ ‘నేను చాలా థియేటర్స్ విజిట్‌‌‌‌‌‌‌‌ చేశాను. ఆడియెన్స్  ప్రతి సీన్‌‌‌‌‌‌‌‌,  ప్రతి డైలాగ్‌‌‌‌‌‌‌‌కు చప్పట్లు కొడుతున్నారు. ముఖ్యంగా  క్లైమాక్స్ చూసి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అయ్యామని చెబుతున్నారు. ఈ  రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. 

ఇది కేవలం విమెన్ సెంట్రిక్ సినిమా కాదు. ఇదొక మంచి థ్రిల్లర్’  అని చెప్పింది. ఇప్పటివరకు సినిమా చూసిన ఆడియెన్స్ అందరూ   అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారని నిర్మాత పూజా శరత్‌‌‌‌‌‌‌‌కుమార్ అన్నారు.  ఇలాంటి కథ చెప్పాలంటే చాలా ధైర్యం కావాలని వరలక్ష్మి భర్త  నిచోలాయ్ సచ్‌‌‌‌‌‌‌‌దేవ్ అన్నారు.
 
©️ VIL Media Pvt Ltd.