Reading Time: < 1 minute

వార్ టైంలో అవసరమైనవి ఇవే.. ఈ ఐదు గాడ్జెట్స్ పక్కా ఉండాల్సిందే !

Caption of Image.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం వల్ల మధ్య ప్రాచ్యంలో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. అప్పుడు మనవాళ్లతో కనెక్ట్ అయి ఉండటం, అప్‌‌‌‌డేట్స్ పొందడం వంటివి కష్టమవుతాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో అత్యవసరమైనవి ఈ ఐదు గాడ్జెట్స్.

బ్యాటరీ/హ్యాండ్-క్రాంక్ ఎమర్జెన్సీ రేడియో
ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ లేకపోయినా  అధికారిక న్యూస్, వెదర్ అప్‌‌‌‌డేట్స్ వింటారు. చాలా మోడల్స్‌‌‌‌లో ఫ్లాష్‌‌‌‌లైట్, ఎస్ఓఎస్ అలారం, యూఎస్‌‌బీ చార్జింగ్ ఉంటాయి.

శాటిలైట్ కమ్యూనికేటర్ 
సెల్ టవర్లు పనిచేయకపోయినా ఎస్ఓఎస్ సిగ్నల్స్ పంపొచ్చు. షార్ట్ మెసేజ్‌‌‌‌లు చేయొచ్చు. జీపీఎస్ లొకేషన్ షేర్ చేయొచ్చు. ఖరీదైనదే కానీ ప్రాణాలు కాపాడుతుంది.

►ALSO READ | బైక్‌‌‌‌కు లాక్‌‌‌‌ వేసినా కొన్నిసార్లు దొంగతనాలు.. కానీ రూ.450తో కొని ఈ బ్రేక్‌‌‌‌ లాక్ వేశారంటే..

స్ట్రాంగ్ ఫ్లాష్‌‌‌‌ లైట్
రీచార్జబుల్, స్ట్రాంగ్ ఎల్ఈడీ టార్చ్. విజిల్, గ్లాస్ బ్రేకర్, బేసిక్ టూల్స్ ఉన్న మల్టీ-టూల్ ఎంచుకోవాలి. చీకటిలో తిరగడానికి, అత్యవసర సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది.

పోర్టబుల్ సోలార్ చార్జర్
కరెంటు రాకపోతే సూర్యరశ్మితో ఫోన్, పవర్ బ్యాంక్ చార్జ్ చేసుకోవచ్చు. బయట, గ్రామీణ ప్రాంతాల్లో లేదా ప్రయాణంలో ఉపయోగకరం.

ఎక్కువ సామర్థ్యం పవర్ బ్యాంక్
ఎలక్ట్రిసిటీ ఆగిపోతే ఫోన్ చార్జ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫాస్ట్ చార్జింగ్, రెండు యూఎస్​బీ పోర్ట్‌‌‌‌లు, బిల్ట్-ఇన్ ఫ్లాష్‌‌‌‌లైట్ ఉన్నది ఎంచుకోవాలి. ఎల్లప్పుడూ ఫుల్ చార్జ్‌‌‌‌లో ఉంచాలి.

©️ VIL Media Pvt Ltd.