Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Public Representatives Should Work Like A Family Remarks At Cultural Event In Vijayawada

CM Chandrababu: ప్రజాప్రతినిధుల మధ్య జరిగిన క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రొఫెషనల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారిని చూస్తుంటే తనకు పాత రోజులు గుర్తొస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకే పరిమితం కాకుండా.. ఆల్ రౌండర్లుగా నిలిచారని అన్నారు. విజయవాడలోని ఆంత్రా లక్స్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Gas Cylinder Priced Hiked: యుద్ధం వేళ కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వంటింటి గ్యాస్ ధర

ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఆయన. నేతల క్రీడల్లో చక్కగా రాణించారన్నారు. క్రీడోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మనస్పూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎన్టీఆర్ పాత్రలో జీవించారని, నేతన్నలను ప్రోత్సహించేందుకు మహిళా ప్రజా ప్రతినిధులు చేనేత వస్త్రాలు ధరించి రావడం అభింనందనీయం అన్నారు. ‘ప్రతి ఒక్క నేత కలిసిమెలిసి కుటుంబంలా పనిచేయాలని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు ముఖ్యమంత్రి బహుమతులు అందజేశారు. అంతకుముందు “హు ఈజ్ హు” అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!