Reading Time: < 1 minute

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో మంటలు చెలరేగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. గోదాం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. లోపల ఉన్న కూలర్లు, విడిభాగాలు ప్లాస్టిక్ మరియు గడ్డితో తయారైనవి కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న సుమారు వందలాది కూలర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనివల్ల యజమానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు, మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ పని చేసే సిబ్బంది వంట కోసం తీసుకొచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు.