Reading Time: < 1 minute

బిర్యానీ షాపు ఫ్రీజర్‌లో మృతదేహం ! కనిపించకుండా పోయిన వ్యక్తి మూడు రోజులుగా ఫ్రీజర్‌లో …

Caption of Image.

లక్నోలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. శనివారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయిన విజయ్ పాల్ (38) అనే వ్యక్తి, ఆదివారం ఉదయం ఒక వెజిటేరియన్ బిర్యానీ షాపు డీప్ ఫ్రీజర్‌లో శవమై కనిపించాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం…. లక్నో GCRG కాలేజీకి ఎదురుగా ఉన్న ఈ బిర్యానీ షాపు రేకుల షెడ్డుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. దీనికి అసలు గేటు కూడా లేదు. విజయ్ పాల్ బాడీ దొరికిన ఫ్రీజర్ పని చేయడం లేదు, అది కూడా  డిస్‌కనెక్ట్ అయి ఉంది. పైగా గత మూడు రోజులుగా ఆ షాపును తెరవలేదు. మృతుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు అతన్నీ విజయ్ పాల్ అని గుర్తించారు.
 
అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విజయ్ పాల్ శరీరంపై ఎలాంటి దెబ్బలు తగిలిన గుర్తులు లేవు. అతని మరణానికి అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. విజయ్ పాల్ వేసుకున్న ఒక చెప్పులు ఒకటి కాలేజీ దగ్గర రోడ్డు  పక్కన దొరకగా, మరొక చెప్పు షాపు లోపల కనిపించింది.

►ALSO READ | భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది: పాక్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

 షాపు యజమాని అజయ్ ఆదివారం ఉదయం సామాన్  కోసం షాపుకు వచ్చినప్పుడు, ఫ్రీజర్‌లో మృతదేహాన్ని చూసి కంగారుపడి పోలీసులకు ఫోన్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని  పోస్ట్‌మార్టం  కోసం పంపించారు. అసలు అతను ఫ్రీజర్‌లోకి ఎలా వెళ్ళాడు ? అది ప్రమాదమా లేక మరేదైనా కారణమా ? అనే కోణంలో విచారణ జరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.