Reading Time: < 1 minute

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. నటుడు శివాజీ రాజా తండ్రి మృతి.

Caption of Image.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తండ్రి జి. రామరాజు ( 85 ) మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.. వృద్ధాప్యం కారణంగా చికిత్సకు ఆయన శరీరం కూడా సహకరించడంలేదు. ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు ( మార్చి 3న ) ఉదయం హైదరాబాద్ మధురానగర్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.

తండ్రి రామరాజు మృతితో శివాజీ రాజా కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు.  ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రామరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  పలువురు సినీ ప్రముఖులు శివాజీ నివాసానికి చేరుకుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

►ALSO READ | Priyanka Chopra: ‘మౌనంగా ఉండలేకపోతున్నాను’ ఇరాన్ యుద్ధంపై ప్రియాంకా చోప్రా ఎమోషనల్ పోస్ట్!

©️ VIL Media Pvt Ltd.