Reading Time: < 1 minute
Rk Roja Campaigns In Support Of Dmk Party

RK Roja: తమిళనాడులో డీఎంకే మద్దతుగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రచారం చేస్తుంది. సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో అద్బుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నారు.. ప్రతి నెలా వెయ్యి రూపాయల మహిళలకు నేరుగా అకౌంట్ లో వేయడం గొప్ప పథకం.. దాని వల్ల మహిళల ఆర్థిక భద్రత పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా మహిళలకు డబ్బులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు అయినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శలు గుప్పించింది.

Read Also: Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..

అయితే, ఎంకే స్టాలిన్ ఒకేసారి ఐదు వేల రూపాయలు మహిళ అకౌంట్ లో వేయడంతో మిగిలిన పార్టీ నేతలందరికి పిచ్చి పట్టింది అంటూ ఆర్కే రోజా మండిపడింది. స్టాలిన్ ను మరోసారి తమిళ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని కోరింది. మహిళలకు ఫ్రీ బస్సు నేను సపోర్ట్ చేస్తాను.. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రతి నెలా కొంత డబ్బును ఫ్రీ బస్సు వల్ల మహిళలు పొందుతున్నారు‌.. పనులకు వెళ్ళేవారికి ఫ్రీ బస్సు ఎంతో ఉపయోగంగా ఉండనుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న స్టాలిన్ పార్టీని గెలిపించి తమిళ ప్రజలు రుణం తీర్చుకోవాలని మాజీమంత్రి ఆర్కే రోజా వెల్లడించింది.