
కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శామ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్ లు(55), తిలక్ వర్మ (01)లతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది.