Reading Time: 2 minutes
Actor Ajay: అజయ్ భార్య ‘మిసెస్‌ ఇండియా’ ఫైనలిస్ట్‌ అని తెలుసా? వీరి లవ్ స్టోరీ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఇరవై ఏళ్లకు పైగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. విలన్‌గా, సహాయ నటుడిగా దక్షిణాది ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అంతే కాదు సారాయి వీర్రాజు అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు అజయ్. దిక్కులు చూడకు రామయ్య తదితర సినిమాల్లో సెకెండ్ హీరోగానూ మెప్పించాడు. గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించినా ఇప్పటికీ బిజీ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నాడు అజయ్. 2024లో ఏకంగా పది సినిమాలు చేసిన ఈ నటుడు 2025లో అరడజనకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. గతేడాది మజాకా, భైరవం, సుందర కాండ, కే- ర్యాంప్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు అజయ్. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. అజయ్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా భార్య, పిల్లలు కూడా పెద్దగా బయట కనిపించరు. ఎలాంటి సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లకు రారు. అయితే అజయ్ భార్య మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోస్ ను తరచూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

అజయ్ భార్య పేరు శ్వేత రావూరీ. కాలేజ్ లో చదువుకుంటోన్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే పెద్దలు అనుమతించలేదో మరో కారణమో తెలియదు కానీ వీరు మొదట ఆర్య సమాజ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా అమ్మాయిలందరూ పెళ్లయ్యాక ఎక్కువగా ఇంటికే పరిమితమవుతారు. కానీ అజయ్ భార్య శ్వేత రావూరీ మాత్రం పెళ్లయ్యాక మోడలింగ్ లో సత్తా చాటింది. 2005లో అజయ్-శ్వేతల వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 12 ఏళ్లకు అంటే 2017 సంవత్సరంలో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో పాల్గొంది శ్వేత. ఫైనల్ దాకా కూడా వెళ్లింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాగా కూడా ఎంపికైంది శ్వేత.

 

View this post on Instagram

 

A post shared by Swetha AJ Ravuri (@swetha.ravuri09)

ప్రస్తుతం అజయ్-శ్వేత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వీరు పెద్దగా బయట కనిపించదరు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తుంటారు. శ్వేత తమ ఫ్యామిలీ ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తుంటారు. అజయ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉందని, ఇక అతని భార్య హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Swetha AJ Ravuri (@swetha.ravuri09)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.