Reading Time: < 1 minute

ముంబై వీధుల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జాగింగ్

Caption of Image.
  • ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్  ముంబై వీధుల్లో జాగింగ్​ చేశారు. మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం ముంబై చేరుకున్న ఆయన.. వెంటనే ఫ్రెషప్ అయి జాగింగ్ కు బయటకొచ్చారు. మెరైన్ డ్రైవ్, కోస్టల్ రోడ్ పరిసరాల్లో అరగంట పాటు గడిపారు.

ముంబై: రోజంతా కట్టుదిట్టమైన భద్రతావలయంలో ఉండే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్  సామాన్యుడిలా రోడ్డుపై పరుగులు తీయడం చూసి ముంబైకర్లు ఆశ్చర్యపోయారు. మంగళవారం ముంబైలో చోటు చేసుకుందీ ఘటన. మూడు రోజుల పర్యటన కోసం ఉదయాన్నే ముంబైలో ల్యాండయ్యారు. నేరుగా హోటల్ కు చేరుకుని ఫ్రెషప్ అయ్యారు. ఆపై డ్రెస్ మార్చుకుని జాగింగ్ కు బయటకొచ్చారు.  నగరంలోని ప్రసిద్ధ మెరైన్ డ్రైవ్ తీరంలో పరుగు తీస్తూ ముంబైకర్లను తనదైన శైలిలో పలకరించారు.  

ముంబై మణిహారంగా పిలిచే మెరైన్ డ్రైవ్, కొత్తగా నిర్మించిన కోస్టల్ రోడ్ పరిసరాల్లో ఆయన సుమారు అరగంట పాటు జాగింగ్ చేశారు. మాక్రాన్ వెంట ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా జాగింగ్ చేయగా, ముంబై పోలీసులు ఆ ప్రాంతమంతా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మాక్రాన్ భారతదేశానికి రావడం ఇది నాలుగోసారి అయినా ముంబైని సందర్శించడం ఇదే ప్రథమం. ఈ తొలి పర్యటనను నగరంలోని అత్యంత అందమైన తీర ప్రాంతంలో జాగింగ్‌‌‌‌తో ప్రారంభించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

©️ VIL Media Pvt Ltd.