Reading Time: < 1 minute

పదో తరగతి పరీక్ష ఎగ్గొట్టిన.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ !

Caption of Image.

CBSE పదవ తరగతి పరీక్షలు మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) నుంచి మొదలయ్యాయి. టీమిండియా అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. బీహార్లోని సమస్తిపూర్ పోడార్ ఇంటర్నేషనల్ స్కూ్ల్ అతని ఎగ్జామ్ సెంటర్. అయితే.. వైభవ్ సూర్యవంశీ తొలి రోజు జరిగిన ఎగ్జామ్కు అటెండ్ అవలేదని.. సీబీఎస్ఈ పాలసీ ప్రకారం.. అతను గైర్హాజరయినట్లు మార్క్ చేశామని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్కే సిన్హా మీడియాకు తెలిపారు.

వైభవ్ సూర్యవంశీ పరీక్షకు హాజరవుతాడని భావించామని.. కానీ అతనికి వేరే బాధ్యతలు ఉన్నాయని చెబుతున్నారని స్కూల్ ప్రిన్సిపాల్ వివరించారు. క్రికెట్ మ్యాచ్ అయినా.. ప్రాక్టీస్ అయినా ఉండి ఉండొచ్చని.. తర్వాత పరీక్ష నుంచైనా అతను హాజరవుతాడని భావిస్తున్నామని చెప్పారు.

అండర్-19 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా కుర్రాళ్ల జట్టు మళ్లీ జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 14 ఏండ్ల బిహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (175) ఈ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించడంతో హరారేలో జరిగిన ఫైనల్లో 100 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టీమిండియా అండర్-19 జట్టు చిత్తు చేసింది. 55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వంద మార్కు అందుకున్న వైభవ్​ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో మరో ఘనత సాధించాడు. అతని జోరుతో ఇండియా 411/9 రన్స్ సాధించి ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అత్యధిక స్కోరు చేసిన తొలి జట్టుగా మరో రికార్డు బద్దలు కొట్టింది.

©️ VIL Media Pvt Ltd.