Reading Time: < 1 minute

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ: పిటిషన్ కొట్టివేత..విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశం..

Caption of Image.

ఢిల్లీ: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమమైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆమె విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆమె డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. సీబీఐ సమర్పించిన ఆధారాలు ప్రాథమికంగా బలమైనవిగా ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

©️ VIL Media Pvt Ltd.