Reading Time: < 1 minute

ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా పాలన :  ఎస్కె. సాబీర్

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్​కె. సాబీర్​ పాషా పేర్కొన్నారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో సీపీఐ కార్పొరేటర్లతో   నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  పదవిని సీపీఐ పార్టీకి ఇచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రజా ప్రతినిధులు కృషి చేస్తారన్నారు. తెలంగాణలోనే తొలి సారిగా సీపీఐ పార్టీ మేయర్​ పీఠంపై కొత్తగూడెంలోనే అధిష్టించి రికార్డు సృష్టించిందన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో నగరానికి అత్యధిక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. 

©️ VIL Media Pvt Ltd.