Reading Time: < 1 minute
Andhra: ఏపీలో లేగ దూడలకు అందాలు పోటీలు

మిస్‌ ఇండియా.. మిస్‌ వరల్డ్‌.. మిస్‌ ఆంధ్రా లాంటి పోటీలు చూసి ఉంటారు.  కానీ, జంతువులకు అందాల పోటీలు నిర్వహించడం చూశారా?.
ఎన్టీఆర్‌ జిల్లా బూదవాడలో లేగ దూడలకు అందాలు పోటీలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.  పశుసంవర్ధకశాఖ, పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన జరిగింది. ఈ పోటీలకు తమ లేగదూడలతో హాజరయ్యారు రైతులు. పోటీలో గెలిచిన లేగదూడల యజమానులకు బహుమతులు అందజేశారు అధికారులు.