Reading Time: 1 minute
Parvesh Verma Slap Video Delhi Minister Seen Slapping Man During Road Inspection

Parvesh Verma Slap Row: ఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో పీడబ్ల్యూడీ మంత్రి ప్రవేశ్ వర్మ ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టిన ఘటన రాజకీయ వివాదంగా మారింది. రోడ్డు పరిస్థితిని పరిశీలించే సమయంలో తనపై మంత్రి చేయిజేసుకున్నారని సాహెబ్ సింగ్ అనే యువకుడు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని యువకుడు తెలిపారు.

ఈ ఘటనపై సాహెచ్‌సింగ్ మాట్లాడుతూ.. రోడ్డు కుంగిపోతున్న విషయాన్ని మంత్రికి చూపించానని, సమస్య ఎత్తిచూపడంతో తనను మంత్రి కొట్టారని ఆరోపించారు. ఈ ఘటన సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారని, బాధ్యులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని సాహెబ్ సింగ్ తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను కూడా అందజేస్తానని అన్నారు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రోడ్డు నిర్మాణంలో అవినీతిని ప్రశ్నించిన యువకుడిని మంత్రి బహిరంగంగా కొట్టారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తానే మరుసటి రోజు తిలక్ నగర్ వెళ్లి రోడ్డును పరిశీలిస్తానని అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ కూడా మండిపడింది. రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రశ్నించిన యువకుడిని మంత్రి కొట్టారని ఆరోపించింది.

ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదంతోనే వివాదం..

రోడ్డ పనుల్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి ప్రవేశ్ వర్మ, ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన సహాయకుడు సాహెబ్ సింగ్‌ను ఆ సమయంలో మంత్రి చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనను సాహెబ్ సింగ్ తన మొబైల్‌లో రికార్డ్ చేస్తున్న సమయంలో మంత్రి చేయిజేసుకున్నారు. సాహెబ్ సింగ్ ఆప్ ఎమ్మెల్యే సోషల్ మీడియా పేజీ కోసం లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాన్ని ఆపేందుకు మంత్రి తన ఫోన్ లాగి, కొట్టినట్లు తెలుస్తోంది.

కుటుంబాన్ని దూషించడంతోనే కొట్టాల్సి వచ్చింది: మంత్రి

ఈ ఘటనపై మంత్రి స్పందించారు. జర్నైల్ సింగ్ తన కార్యకర్తలో అక్కడి వచ్చారని, వారిలో ఒకరు తన కుటుంబాన్ని అసభ్యంగా దూషించినట్లు ఆరోపించారు. తాను కోపంలో అలా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. అయితే, ‘‘తాను అలా కొట్టి ఉండాల్సింది కాదు’’ అని జరకూడదని జరిగిందని మంత్రి విమరణ ఇచ్చారు. జర్నైల్ సింగ్ తన కార్యకర్తలతో వచ్చి దురుసుగా ప్రవర్తించడం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని అన్నారు.