
Bank Strike: దేశవ్యాప్తంగా రేపటి నుంచి (సెప్టెంబర్ 28, సోమవారం) నుండి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చింది. అక్టోబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగనుంది. బ్యాంక్ ద్వారా నిర్వహించే సేవల్లో మూడు రోజులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
యూఎఫ్‌బీయూ పలు డిమాండ్ల కోసం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి 5 రోజుల పని నియమాన్ని అమలు చేయడం కీలక డిమాండ్‌గా ఉంది. ప్రస్తుతం బ్యాంకులు రెండో, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటోంది. మిగిలిన వారాల్లో 6 రోజులు పనిచేస్తున్నాయి. దీంతో పాటు పెన్షన్ సవరణ వంటి ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. డీఏ, ఇతర సర్వీస్ అంశాలపై కూడా బ్యాంక్ యూనియన్లు డిమాండ్లు చేస్తున్నాయి. సెప్టెంబర్ 22న జరిగిన చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో సెప్టెంబర్ 28-30 సమ్మెను కొనసాగించాలని సంఘాలు నిర్ణయించాయి.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27 ఆదివారం రోజు వినియోగదారులు తమ ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి బ్యాంకులు తెరిచి ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బ్యాంకులు తమ వినియోగదారులకు మెసేజులు పంపుతూ సమ్మె గురించి హెచ్చరించాయి. సమ్మె ప్రారంభమయ్యేలోపు కీలక పనుల్ని పూర్తి చేసుకోవాలని కోరాయి. మూడు రోజుల సమ్మె కారణంగా నగదు డిపాజిట్లు, విత్ డ్రాలు, చెక్కులకు సంబంధించిన పనులు, కేవైసీ వంటివి ప్రభావితం కావచ్చు.
బ్యాంకుల సమ్మె వల్ల కొంత అంతరాయం ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యధావిధిగా పని చేస్తాయి. యూపీఐ ఆధారిత ఫోన్ పే, జీపే ఇతర ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. సమ్మె వల్ల ఏటీఎంలలో నగదు కొరత కలిగే అవకాశం ఉంది.