
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల హిల్స్ రోడ్ నంబర్ 11లోని ఓ నివాసంలో వాషింగ్ మిషన్ ఉపయోగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. దీంతో కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.