Reading Time: 2 minutes

20 ఏళ్లకే ప్రీ డయాబెటిస్.. ఈ 5 రోజువారీ అలవాట్లే కారణమా? డాక్టర్లు చెప్పిన షాకింగ్ నిజాలు

Caption of Image.

డయాబెటిస్ అనగానే  మిడిల్ ఏజ్ వాళ్లకో, వృద్దులకో  వస్తుంది.. మనకెందుకు వస్తుంది అని చాలా లైట్ తీసుకుంటారు యువత.  ఇప్పుడు అంతా పరిస్థితి మారిపోయింది. 20నుంచి 30 ఏళ్ల వయసువారే ఎక్కువగా ప్రీ డయాబెటిస్ కు గురవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న  ప్రీ డయాబెటిస్ తో యువతకూ ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే, రోజువారీ అలవాట్లను మార్చుకోకుండా డయాబెటిస్ ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

యువతలో ప్రీ-డయాబెటిస్ కారణం.. 

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్ వెనుక ఉన్న కారణాలు అంత సంక్లిష్టమైనవేమీ కావు. అవి రోజువారి అలవాట్లే యువతో ప్రీ డయాబెటిస్ కు ప్రధాన కారణమంటున్నారు  డాక్టర్లు. కార్బోహైడ్రేట్లు,  చక్కెర అధికంగా ఉండే ఆహారం, డెస్క్‌ల వద్ద లేదా స్క్రీన్‌ల ముందు ఎక్కువ గంటలు కూర్చోవడం, ఒత్తిడి, సరిపోని నిద్ర, పెరుగుతున్న ఊబకాయం వంటి రోజువారీ అలవాట్లతో యూత్ లో ప్రీ డయాబెటిస్ ముడిపడి ఉందంటున్నారు మిరస ఆయుర్వేద డైరెక్టర్ డాక్టర్ మన్‌దీప్ సింగ్ బసు.

 ప్రీడయాబెటిస్ అనేది డయాబెటిస్ కు  ముందు దశ. ఈ దశలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇంకా డయాబెటిస్ తో అని నిర్ధారించే స్థాయిలో షుగల్ లెవెల్స్ ఉండవు. కేవలం మెడిసిన్స్ పై ఆధారపడకుండా, డైలీ లైఫ్ స్టైల్ లో మార్పుల ద్వారా ప్రీ డయాబెటిస్ ను ఈజీగా పరిష్కరించగల కాలం కూడా ఇదేనని సూచిస్తున్నారు.

రాత్రంతా ఫోన్, ఆలస్యంగా నిద్రపోవడం..

రాత్రి 12 తర్వాత కూడా ఫోన్ చూడటం, 5నుంచి-6 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇన్సులిన్ పనితీరు తగ్గి బ్లడ్ షుగర్ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ ..

రోజూ కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా, స్వీట్స్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ప్రీడయాబెటిస్ కు మెయిన్ కారణం.

రోజంతా కూర్చునే లైఫ్ స్టైల్, వ్యాయామం లేకపోవడం..

కాలేజ్, ల్యాప్ టాప్, ఫోన్ అంటూ రోజంతా కూర్చోవడం, కనీసం 30 నిమిషాల వాకింగ్ కూడా చేయకపోవడం వల్ల కండరాలు షుగర్ ను వాడుకోలేవు. దీంతో రక్తంలో షుగర్ నిల్వ కావడంతో సమస్య పెరగడం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్, అర్ధరాత్రి భోజనం:

పొద్దున టిఫిన్ మానేసి, రాత్రి ఆలస్యంగా ఎక్కువ మోతాదులో తినడం వల్ల షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి ఇన్సులిన్ బ్యాలెన్స్ తప్పుతుంది.

ALSO READ : మీ కిచెన్ నిజంగా శుభ్రంగా ఉందా ?

ఒత్తిడి పట్టించుకోకపోవడం..

ఎగ్జామ్స్, జాబ్ టెన్షన్, నిద్రలేమితో స్ట్రెస్ హార్మోన్ పెరిగి బ్లడ్ షుగర్ ను పెంచుతుంది. దీంతో చిన్న వయసులోనే ప్రీడయాబెటిస్ బారిన పడుతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.