Reading Time: < 1 minute
Congress Leader Prafulla Gudadhe Compares Rss With Hizbul Mujahideen

RSS: నాగ్‌పూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడ ప్రఫుల్ల గుడే పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ఒక ఉగ్రవాద సంస్థతో పోల్చారు. హిజ్బుల్ ముజాహిదీన్, ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి తేడా లేదని పాటిల్ అన్నారు. ఆర్ఎస్ఎస్‌ను మూడు సార్లు నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. గతంలో కాంగ్రెస్ నేతలు హుస్సేన్ దల్వాయి, ఉదిత్ రాజ్ వంటి వారు కూడా ఇలాంటి విమర్శలే చేశారు.

నాగ్‌పూర్‌లోని ఒక ఫ్లైఓవర్‌కు పేరు పెట్టే విషయంలో కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతోంది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీనిపై పాటిల్ స్పందిస్తూ…‘‘ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిజ్బుల్ ముజాహిదీన్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఇంతకుముందే మూడుసార్లు నిషేధించారు. అది ఒక ఉగ్రవాద సంస్థ. హిజ్బుల్ ముజాహిదీన్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ల మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు. రెండింటి స్వభావం ఒకటే’’ అని అన్నారు. పాటిల్ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో ఓడిపోయారు.