
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు రాత్రి 9.13 నిమిషాల ముహూర్తానికి ఈ సినిమా ప్రీమియర్స్ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే, పబ్లిక్ షోలు పడటానికి ముందే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఇన్‌సైడ్ టాక్ (ఫస్ట్ రివ్యూ) బయటకు వచ్చేసింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా థియేటర్లలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా కంటెంట్ లెంగ్త్ ఏకంగా 2 గంటల 45 నిమిషాల పాటు ఉన్నప్పటికీ, ఆద్యంతం సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని ఇన్‌సైడ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, అదిరిపోయే క్లైమాక్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. ఆఖరి 40 నిమిషాలు మాత్రం నాని యాక్టింగ్ లో తన విశ్వరూపం చూపించాడట. థియేటర్లు దద్దరిల్లిపోయేలా డిజైన్ చేసిన నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు అడ్రినలిన్ రష్ ఇవ్వడం గ్యారెంటీ అని చెబుతున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి యాక్షన్ సీన్ కూ గూస్ బంప్స్ తెప్పిస్తాయని టాక్. నాని కెరీర్‌లోనే ఇది పీక్ పెర్ఫార్మెన్స్ అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
‘ది ప్యారడైజ్’ లో ఆడియన్స్ కోసం మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ లు చాలానే ప్లాన్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ముఖ్యంగా సెకండాఫ్ లో కథ కీలక మలుపు తిరిగే సమయంలో ఒక పాపులర్ యాక్టర్ సర్ ప్రైజ్ క్యామియో ఎంట్రీ ఇస్తాడట. ఈ ఎంట్రీ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ కానుందని ఇన్‌సైడ్ టాక్. అలాగే ‘బక్కోడు’ తీసుకున్న ఒక సంచలన (రాడికల్) నిర్ణయంతో స్క్రీన్ మీద ‘ఆయా షేర్’ (Aya Sher) ఇచ్చే సర్ ప్రైజ్ వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు భయంకరమైన యాక్షన్ ఉంటూనే, మరోవైపు ఈ సినిమాలో బలమైన ‘మదర్ ఎమోషన్స్’ పండటం గమనార్హం. ఇప్పటికే చార్ట్ బస్టర్ అయిన ‘సమ్మక్క’ పాట మాత్రమే కాకుండా, సినిమాలో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే మరో అద్భుతమైన రూటెడ్ ‘తల్లి’ సాంగ్ ఉందట. ఈ సాంగ్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికి శ్రీకాంత్ ఓదెల సృష్టించిన ‘ప్యారడైజ్ వరల్డ్’, ఆయన బ్రిలియంట్ టేకింగ్, కథా నేపథ్యం ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఎటు చూసినా సర్‌ప్రైజ్‌లు, మదర్ ఎమోషన్స్, అనిరుధ్ మ్యూజిక్, ఆఖరి 40 నిమిషాల నాని ర్యాంపేజ్‌తో.. రాత్రి 9.13 నిమిషాల నుంచి థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ జాతర మొదలవ్వడం ఖాయమని సినీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.