Reading Time: < 1 minute

బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నా ఫలితం లేదా ? మీ స్కిన్ కేర్ కోసం అసలైన సీక్రెట్స్ ఇవే !

Caption of Image.

వయస్సు పెరిగే కొద్దీ మన శరీరంలాగే చర్మ అవసరాలు కూడా మారుతుంటాయి. కానీ మనలో చాలామంది 20 ఏళ్ల వయసులో వాడిన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే 30 లేదా 40 ఏళ్లలో కూడా వాడుతూ ఉంటారు. ఇది చర్మానికి మేలు చేయకపోగా మరింత హాని కలిగిస్తుంది.

ముఖం మీద చిన్న ముడత కనిపించగానే భయపడి అనవసరమైన యాంటీ-ఏజింగ్ క్రీములు వాడటం, టీవీలు లేదా మొబైల్ ఫోన్లు చూస్తూ రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం, మొటిమలను గోళ్లతో గిల్లడం వంటి చిన్న చిన్న అలవాట్లు మన చర్మ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం వయస్సుకు తగిన సంరక్షణ ఎంత ముఖ్యమో, మన దినచర్యలో చేసుకునే చిన్న చిన్న మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం!

*ముఖం మీద స్కిన్ శుభ్రంగా, అందంగా ఉండాలంటే టోనర్ వాడటం తప్పనిసరి. టోనర్ వాడటం వల్ల చర్మరంధ్రాల్లో పేరుకున్న మురికిని తీసేయొచ్చు. చర్మం మీద జిడ్డు కూడా వదులుతుంది. అలాగని ఏదంటే అది వాడకుండా ఆల్కహాల్ లేని నేచురల్ టోనర్స్ వాడాలి.

*చాలామంది ఎప్పుడూ ఒకేరకమైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలా కాకుండా ఏజ్ కి తగ్గ బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి.

*సరిపడా నిద్ర పోకపోతే స్ట్రెస్ హార్మోన్లు విడుదలై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. అందుకని స్కిన్ దెబ్బతినకుండా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి. అంతేకానీ అర్ధరాత్రుళ్ల వరకు మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చోవద్దు.

*చర్మం మీద ముడత కనిపిస్తే చాలు వెంటనే యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ వాడతారు చాలామంది. ఇలా అనవసరంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడం వల్ల చర్మానికి మరింత హాని కలుగుతుంది.

ఇవే కాకుండా, కొందరు ఉన్నట్టుండి డైట్ మారుస్తారు. రాత్రిపూట చర్మానికి క్రీము రాసుకోరు. ముఖం మీద పింపుల్ ఉంటే ఎప్పుడూ దాని మీదే చేయి ఉంటుంది. బ్లాక్ హెడ్స్ ని గోళ్లతో తీస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల చర్మం మీద ఉండే కణాలు దెబ్బ తింటాయి. అందుకని ఫేషియల్ స్కిన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
 

©️ VIL Media Pvt Ltd.