
న్యూజీలాండ్ తో టెస్టు సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది టీమిండియా. అందులో భాగంగా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. త్వరలో టీ20, వండే, టెస్టు సిరీస్ లు ఉన్న క్రమంలో.. టెస్టు సిరీస్ కే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు.
అందులో భాగంగా లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ నుంచి కీలక ప్లేయర్లకు రెస్టు ఇవ్వనున్నట్లు హింటిచ్చారు. టెస్టుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పిన గంభీర్.. ప్లేయర్లకు రెస్టు ఇచ్చే అంశం న్యూజీలాండ్ సిరీస్ కేనని క్రీడావర్గాలు భావిస్తున్నాయి.
న్యూజీలాండ్ తో 12 మ్యాచ్ ల టూర్ కు ఇండియా సిద్ధమవుతోంది. మొత్తం ఐదు వండేలలో చివరి వండే ముగిసిన మూడు రోజులకే టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు వెల్లింగ్టన్ లో నవంబర్ 19 నుంచి మొదలవుతుంది. దీంతో ప్లేయర్లపై వర్క్ లోడ్ పడకుండా.. టీ20, వండేల నుంచి రెస్టు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు గంభీర్.
టెస్టు సిరీస్ కు ముందు కీలక ప్లేయర్లైన శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వీ జైశ్వాల్, బుమ్రా, సిరాజ్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి లు టెస్టు సిరీస్ లో కీలకంగా కానున్నారు. చివరి వండే, మొదటి టెస్టుకు కేవలం రెండు రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో టీ20, వండేల నుంచి వీరిని దూరంగా ఉంచనున్నట్లు గంభీర్ చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది.
ఇండియాలో ఎంత మంది కొత్త వాళ్లు వస్తున్నా.. టెస్టు క్రికెట్ కే అధిక ప్రాధాన్యమని చెప్పడం గంభీర్ మాటల ద్వారా తెలుస్తోంది. ఇండియన్ ప్లేయర్లు దాదాపు అన్ని ఫార్మాట్లను మేనేజ్ చేయగల కెపాసిటీ ఉండటంతో.. అవసరమైన సమయంలో ప్లేయర్లకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఇండియా ప్రధాన్య టెస్టు క్రికెట్. టీ20కి ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ.. ఇండియా దృష్టి టెస్టులపైనే ఉంటుందన్నారు. టీ20లో బలమైన దేశం.. క్రికెట్ లో బలమైన దేశం కాలేదని.. టెస్టులో బలంగా ఉంటేనే అసలైన క్రికెట్ జట్టు అని చెప్పుకొచ్చారు.