Reading Time: < 1 minute

సుమలత వర్గానికి షాక్.. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ కు మళ్లీ ఎన్నికలు.. ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ డెసిషన్!

Caption of Image.

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో గత కొంతకాలంగా సాగుతున్న వివాదాలు, అంతర్గత పోరుకు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఎండ్ కార్డ్ వేసే దిశగా అడుగులు వేసింది.. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో సుమలత వర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది ఫెడరేషన్ .

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో నెల్లకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈరోజు ( సెప్టెంబర్ 23, 2026 ) ఫెడరేషన్ పెద్దలు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కు సుమలత వర్గంతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, ఆయన మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. మొత్తం 225 మంది సినీ డ్యాన్సర్లు ఈ సమావేశానికి హాజరైయ్యారు. ఈ భేటీలో ఫెడరేషన్ ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయ సేకరణ జరిపింది.

ఈ సమావేశానికి హాజరైన సభ్యుల్లో ఏకంగా 214 మంది డ్యాన్సర్లు రఘు మాస్టర్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ జైకొట్టారు. ప్రస్తుత అధ్యక్షురాలు సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. మెజారిటీ సభ్యుల తీర్పు స్పష్టంగా రఘు మాస్టర్ వైపే ఉండటంతో, ప్రస్తుత బాడీని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఫెడరేషన్ పెద్దలు అధికారికంగా ప్రకటించారు.

ALSO READ : బిడ్డను కనాలనుకుంటున్న.. పెళ్లి మాత్రం చేసుకోను.. 

అంతేకాకుండా, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు గానూ అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేసింది ఫెడరేషన్. డ్యాన్సర్ల హక్కులు, అవకాశాలు, రెమ్యునరేషన్ల విషయంలో తలెత్తిన విభేదాలు ఈ స్థాయికి చేరగా.. ఈ ఎన్నికల ప్రకటనతో టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు అక్టోబర్ 11న జరగబోయే పోరులో డ్యాన్స్ అసోసియేషన్ పగ్గాలు ఎవరు దక్కించుకుంటారోనని సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.