Reading Time: 2 minutes
Oppo K14 Plus Launching In India On September 29 With 8000mah Battery And Good Features

OPPO K14 Plus: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒప్పో (OPPO) మరో కొత్త మిడ్‌రేంజ్ ఫోన్‌ను తీసుకొస్తోంది. పనితీరు, భారీ బ్యాటరీ, డిస్‌ప్లే, డ్యూరబిలిటీపై ఫోకస్ చేసిన OPPO K14 Plusను సెప్టెంబర్ 29, 2026న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. K సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ ఫోన్‌ను ప్రధానంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మెరుగైన పనితీరు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు.

Dimensity 7360 MAX ప్రాసెసర్

OPPO K14 Plusలో MediaTek Dimensity 7360 MAX చిప్‌సెట్‌ను అందించనున్నారు. ప్రాథమిక బెంచ్‌మార్క్ వివరాల ప్రకారం ఈ ఫోన్ AnTuTuలో 10 లక్షలకు పైగా స్కోర్ సాధించినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేసినప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 5,000mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ను ఇందులో అందించారు.

1.5K AMOLED డిస్‌ప్లే..

OPPO K14 Plusలో 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే డిస్‌ప్లే లోకల్ పీక్ బ్రైట్‌నెస్ 3,600 నిట్స్ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో ఎండలో కూడా స్క్రీన్ కంటెంట్‌ను స్పష్టంగా చూడటంతో పాటు, స్క్రోలింగ్, యానిమేషన్లు, సపోర్ట్ చేసే గేమ్స్‌లో స్మూత్ విజువల్స్ లభించనున్నాయి.

50MP OIS కెమెరా

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 50MP కెమెరా ఉండగా, ఇది OISకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 4K వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP సోనీ IMX480 సెన్సార్ను అందిస్తున్నారు.

8000mAh భారీ బ్యాటరీ

ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణల్లో 8,000mAh బ్యాటరీ ఒకటి. ఈ సామర్థ్యంతో సాధారణ వినియోగంలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను అందించేలా ఫోన్‌ను రూపొందించారు. బ్యాటరీతో పాటు దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్థాయిలోనూ పలు ఫీచర్లను అందిస్తున్నారు.

IP69K రేటింగ్..

డ్యూరబిలిటీ విషయంలో OPPO K14 Plusకు IP69K రేటింగ్ అందించారు. దీంతో దుమ్ము, అధిక పీడనంతో వచ్చే నీటి జెట్‌ల నుంచి రక్షణ లభించేలా ఫోన్ రూపొందించారు. అలాగే ఫోన్‌కు Damage Proof 360 Armour Body చాసిస్‌ను అందించారు. ఇది ప్రమాదవశాత్తూ ఫోన్ కిందపడటం, ఢీకొనడం వంటి సందర్భాల్లో మెరుగైన రక్షణ అందించేందుకు రూపొందించిన నిర్మాణం. అంతేకాకుండా ఆరేళ్ల స్మూత్ నెస్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా దీర్ఘకాలిక వినియోగంలోనూ సిస్టమ్ పనితీరు, స్పందన స్థాయిలను కొనసాగించేలా ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

స్టీరియో స్పీకర్లు

ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. స్పీకర్లలో “Ultra Volume” మోడ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే కొత్త వెర్షన్ ColorOSతో ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఉత్పాదకత, టాస్క్ మేనేజ్‌మెంట్ కోసం సిస్టమ్ స్థాయిలో జనరేటివ్ AI ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి.

ధర

OPPO K14 Plusను భారత్‌లో సెప్టెంబర్ 29, 2026న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ యూనిక్యూ ద్వారా ప్రత్యేకంగా విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలోనే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫోన్ ధర, ర్యామ్-స్టోరేజ్ వేరియంట్లు, లాంచ్ ఆఫర్లు వంటి పూర్తి వివరాలను సెప్టెంబర్ 29న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో వెల్లడించనుంది.