Reading Time: < 1 minute
Chandigarh University Freshers Dance Video Viral Controversy

ప్రతి కాలేజీలోనూ.. ప్రతి యూనివర్సిటీలోనూ జూనియర్లకు స్వాగతం పలికేందుకు సీనియర్లు ఫ్రెషర్స్ వేడుకలు నిర్వహించడం సాధారణంగా జరుగుతుంటాయి. కార్యక్రామల్లో భాగంగా డ్యాన్స్‌లు, ఆయా రకాలైన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. అయితే సినిమాల్లో కాకుండా విద్యాలయాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అశ్లీలంగా కాకుండా సాంప్రదాయంగా నిర్వహించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చండీగఢ్ యూనివర్సిటీలో జరిగిన ఫ్రెషర్స్ వేడుకలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

వైరల్ వీడియోలో ఆరుగురు విద్యార్థులు జంటలుగా డ్యాన్స్‌ చేశారు. కొంతమంది మగ విద్యార్థులు తమ మహిళా సహచరులను చేతుల్లోకి ఎత్తుకుని డ్యాన్స్‌ చేశారు. ఆ సమయంలో ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున కేరింతలు వినిపించాయి. అయితే పాట సాగే క్రమంలో మహిళా విద్యార్థులను తల్లకిందులుగా చేశారు. ఆ సమయంలో విద్యార్థినుల బాడీ ఎక్స్‌పోజ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను నిత్య అనే విద్యార్థిని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.

అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిర్వాహకులపై తీరును ఖండించారు. మరికొందరు ఇందులో అభ్యంతరకరం ఏముందని సమర్థించారు. విద్యాసంస్థల్లో ఇలాంటి కొరియోగ్రఫీలు ఎందుకు అనుమతిస్తున్నారని ఇంకొందరు నిలదీశారు. అయితే కాలేజీల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చేసే సాధారణ డ్యాన్స్‌ ప్రదర్శనగానే చూడాలని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఏదేమైనా ప్రదర్శన హద్దులు దాటిందని మరికొందరు మండిపడ్డారు.