బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లోని సభ్యుల మధ్య నామినేషన్ల వేడి పెరగడంతో పాటు ఎలిమినేషన్ భయం కూడా మొదలైంది. తాజాగా విడుదలైన అన్అఫీషియల్ ఓటింగ్ పోల్ ఫలితాల ప్రకారం ప్రేక్షకులలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం జరిగిన ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ పూర్తిగా మారిపోయింది. ఇన్ని రోజులు అట్టడుగున ఉన్న సుధీర్ ఇప్పుడు విన్నర్ రేసులోకి దూసుకొచ్చాడు.
టాప్ రేసులో సుధీర్ , త్రిగుణ్ ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ పరిశీలిస్తే సుధీర్ 24.41% ఓట్లతో (3,929 ఓట్లు) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన వెనుకే అతి స్వల్ప తేడాతో త్రిగుణ్ 24.25% ఓట్లతో (3,904 ఓట్లు) గట్టి పోటీ ఇస్తున్నాడు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
ప్రేక్షకుల మద్దతు చూస్తుంటే ఈ వారం వీరిద్దరూ సేఫ్ జోన్లో ఉన్నట్లే కనిపిస్తోంది. సేఫ్ జోన్లో చరణ్, షాలిని, వంశీమూడో స్థానంలో చరణ్ 14.16% ఓట్లతో (2,280 ఓట్లు) నిలవగా, షాలిని 9.84% ఓట్లతో (1,584 ఓట్లు) నాల్గవ స్థానంలో ఉంది. ఐదో స్థానంలో ఉన్న వంశీ 9.14% ఓట్లను (1,472 ఓట్లు) సాధించాడు. వీరు కూడా ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రమాదం నుండి కాస్త దూరంగానే ఉన్నట్లు సమాచారం.
డేంజర్ జోన్లో అమన్, వర్షిణి, ఝాన్సీఈ వారం ఎలిమినేషన్ గండం ప్రధానంగా ముగ్గురు కంటెస్టెంట్లపై వేలాడుతోంది. అమన్ 6.95% ఓట్లతో (1,118 ఓట్లు) ఆరో స్థానంలో ఉండగా, వర్షిణి 6.14% ఓట్లతో (989 ఓట్లు) ఏడో స్థానంలో నిలిచింది. ఇక అందరికంటే చివరి స్థానంలో ఝాన్సీ కేవలం 5.1% ఓట్లతో (821 ఓట్లు) డేంజర్ జోన్లో నిలిచింది.
ఓటింగ్ ముగియడానికి ఇంకా దాదాపు 2 రోజుల 22 గంటల సమయం ఉండటంతో, ఈ తక్కువ ఓట్లు సాధించిన వారే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటింగ్ గడువు ముగిసేలోపు ఫ్యాన్స్ వేసే ఓట్లను బట్టి ఈ ఎలిమినేషన్ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మరి ఈ మూడో వారంలో హౌస్ నుండి బయటకు వెళ్లే ఆ కంటెస్టెంట్ ఎవరో చూడాలి!




