
Banking News: దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులకు కీలక సమాచారం అందింది. సాధారణంగా ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే సెప్టెంబర్ 27, 2026 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సాధారణంగా పనిచేయనున్నాయి. ప్రతిపాదిత మూడు రోజుల బ్యాంకు సమ్మె కారణంగా ఖాతాదారులకు వరుసగా ఎక్కువ రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎందుకు ఆదివారం బ్యాంకులు ఓపెన్ ఉంటాయి?
బ్యాంకు ఉద్యోగుల సంఘాల సమాఖ్య UFBU (United Forum of Bank Unions) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీనికి ముందు సెప్టెంబర్ 26 నాలుగో శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం కావడంతో బ్యాంకింగ్ సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.