తొలి ఏకాదశి … వీరి జాతకం మారడం ఖాయం
జూలై చివరి వారంలో, తొలిఏకాదశి సమయంలో కొన్ని గ్రహాల కదలికలు, మార్పుల వలన ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో నాలుగు రాశుల వారికి ఎనలేని ప్రయోజనాలు తీసుకొస్తుంది. కాగా, ఇప్పుడు మనం పండుగ తర్వాత నుంచి ఏ రాశి వారికి లక్కు కలిసి వస్తుందో చూద్దాం.
తుల రాశి : వీరికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో, వాటిని చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. సంపద పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు శుభాలను తీసుకొస్తాయి.
మకర రాశి : మకర రాశి వారికి చాలా మంచి సమయం. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో చాలా బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో వీరిదే పై చేయి అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం
మీన రాశి : మీన రాశి వారికి ఈ సమయం పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు. అంతే కాకుండా రియలెస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది.



