Reading Time: < 1 minute
Metro: క్రికెట్‌ లవర్స్‌ సూపర్ గుడ్‌న్యూస్.. SRH vs RCB మ్యాచ్‌ నేపథ్యంలో మెట్రో సేవలు పొడగింపు

నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్‌ మెట్రో సంస్థ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఐపీఎల్‌ 2026 భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చివరి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అభిమానులు సౌకర్యం కోసం మెట్రో సమయాన్ని పొగడిస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ ముగిసే సరికి దాదాపు అర్థరాత్రి అవుతుందని.. ఆ టైంలో భారీ ట్రాఫిక్‌తో పాటు జనాలు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందు ఎదుర్కొంటారిని.. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అర్థరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది.

అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా జనాలు మెట్రో స్టేషన్‌ వద్దకు వచ్చే అవకాశం ఉంది.. దీని ద్వారా టికెట్ కౌంటర్ వద్ద భారీ క్యూలైన్స్‌ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి మ్యాచ్ వీక్షించేందుకు మెట్రోలో వచ్చే క్రికెట్ అభిమానులు ఒకే సారి రిటర్న్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా సురక్షితంగా,త్వరగా ఇళ్లకు చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని.. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినిగియోగించుకోవాలని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.