Reading Time: < 1 minute

కూకట్పల్లిలో కారు బీభత్సం.. మరో కారు, బైకును ఢీకొట్టి టిఫిన్ సెంటర్లోకి దూసుకుపోయింది

Caption of Image.

హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు మరో కారు, బైక్ ను ఢీకొట్టడమే కాకుండా టిఫిన్ సెంటర్ లోకి దూసుకుపోవడం జనాలను భయాందోళనలకు గురిచేసింది. బుధవారం (మే 20) వివేకానంద నగర్ కమాన్ నుండి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 

ఎలక్ట్రిక్ కారు అతివేగంగా వస్తూ మరో కారు, ద్విచక్ర వాహనాలను ఢీకొంటూ ఏరువాక టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. దీనితో ఒక్కసారిగా వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కారు, బైకు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా టిఫిన్ సెంటర్ లో ఫర్నిచర్ దెబ్బతిన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.