Reading Time: < 1 minute

హైదరాబాద్ పబ్లిక్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Caption of Image.

హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాట్సాప్‌ మీసేవలో కొత్తగా మరిన్ని GHMC సేవలు చేర్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. తొమ్మిది కొత్త పౌర సేవలను వాట్సాప్‌ మీసేవలో అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ సేవలను ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో డిజిటల్ సేవలను విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి వాట్సాప్ మీసేవలో ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రివిజన్‌, జనన, మరణ ధ్రువీకరణ సవరణ సేవలు, ఇంటి దగ్గర జననం, మరణ నమోదు, ప్రాపర్టీ డోర్ నంబర్‌, పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్‌, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

8096958096 నంబర్‌ను ‘MeeSeva Telangana’గా సేవ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. వాట్సాప్‌లో ‘Hi’ మెసేజ్ పంపి సేవలు పొందొచ్చని వెల్లడించింది. ఫారమ్‌ నింపి, పేమెంట్ పూర్తి చేస్తే వెంటనే దరఖాస్తు నమోదు అవుతుందని తెలిపింది. 

►ALSO READ | మే 23న యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి

ఇప్పటికే తీసుకొచ్చిన వాట్సాప్‌ మీసేవకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సేవలను మరింత విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనన ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ సేవలకు ప్రజలు ఎక్కువగా ఈ వాట్సాప్ మీసేవను వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

©️ VIL Media Pvt Ltd.