Reading Time: < 1 minute
Csk Vs Srh Brevis Blitz Powers Chennai To 180 Cummins Picks Three Wickets

CSK vs SRH: చెన్నై వేదికగా జరుగుతున్న సీఎస్‌కే-ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే జట్టు ఆరంభంలో దూకుడుగా ఆడినా, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ దిశగా సాగలేకపోయింది. అయితే చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు పోటీ స్కోర్ అందించాడు.

ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 13 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 27 పరుగులు చేసి వేగంగా ఆరంభం ఇచ్చాడు. మరోవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ 21 బంతుల్లో 15 పరుగులకే పరిమితమయ్యాడు. ఉర్విల్ పటేల్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. మధ్య ఓవర్లలో కార్తిక్ శర్మ దూకుడుగా ఆడి 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. చివర్లో డేవాల్డ్ బ్రెవిస్ చెలరేగిపోయాడు. 27 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 44 పరుగులు చేసి సీఎస్‌కే స్కోర్‌ను వేగంగా ముందుకు నడిపించాడు. ఇక శివమ్ దూబే కూడా 26 పరుగులతో మంచి6 ఇన్నింగ్స్ ఆడాడు.

చివర్లో సీఎస్‌కే వరుస వికెట్లు కోల్పోయినా 180 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. సకీబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఈషాన్ మలింగ, ప్రఫుల్ హింగే తలో వికెట్ సాధించారు.