Reading Time: < 1 minute
Priyanka Chopra Shocked By Vijay Craze Thamizhan Movie Memories

ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రయాణం మొదలైన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌తో కలిసి నటించిన ‘తమిళన్’ (Thamizhan) సినిమానే ప్రియాంకకు తొలి చిత్రం. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయ్ గురించి ఆమె చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

2002లో విడుదలైన ‘తమిళన్’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ సమయంలో తనకు తమిళ భాష అసలు రాదని, డైలాగులను పేపర్‌పై రాసుకుని బట్టీపట్టి చెప్పేదాన్నని తెలిపారు. సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందో కూడా అప్పటి వరకు తెలియదని చెప్పారు.. ‘నాకు సినిమాలు థియేటర్‌లో చూడడం మాత్రమే తెలుసు. కానీ ‘తమిళన్’ షూటింగ్ సమయంలో సెట్స్‌లో చూసిన వాతావరణం నాకు పూర్తిగా కొత్తగా అనిపించింది. విజయ్‌ను చూడటానికి వందలాది అభిమానులు వచ్చేవారు. ఆయన డ్యాన్స్ చేస్తున్నా, డైలాగులు చెబుతున్నా అందరూ మైమరచి చూస్తుండేవారు. ఆయనకు ఉన్న అభిమానాన్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అందరూ విజయ్‌ను దేవుడిలా చూస్తున్నారని అనిపించింది’ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చా.

2002లో విడుదలైన ‘తమిళన్’ సినిమా ప్రియాంక చోప్రాకు మాత్రమే కాదు, దర్శకుడు మజిత్‌కూ తొలి చిత్రమే కావడం విశేషం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా విజయ్–ప్రియాంక జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ప్రియాంక చెప్పిన ఈ మాటలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.