చాలా మంది తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి కూర్చొనే విధానం, నిల్చొనే విధానం, ఇలా ప్రతీది కూడా ఒ వ్యక్తి వ్యక్తిత్వం, గుణగణాలపై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా ఒక వ్యక్తి గ్లాస్ పట్టుకునే విధానం కూడా తన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.
ఎవరు అయితే రెండు చేతులతో గ్లాస్ పట్టుకుంటారో వారు ఒత్తిడితో ఉంటారంట. అంతే కాకుండా వీరిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీరు తమ భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఇలాంటి వ్యక్తులు ఇతరులతో కలవడానికి కూడా చాలా సమయం తీసుకుంటారంట. కానీ వీరు ఎవరిని అయితే ఇష్టపడతారో వారితో చాలా ఆనందంగా జీవిస్తారు. వారికి అన్ని సమయాల్లో అండగా ఉంటారు.
ఎవరు గ్లాస్‌ను పై అంచు నుంచి పట్టుకుంటారో వారు చాలా ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవారు. అలాగే వీరు చాలా ఆనందంగా జీవితాన్ని గడిపే స్వభావం ఉండే వారు. ఇలా గ్లాస్‌ను అంచు నుంచి పట్టుకునే వ్యక్తులు చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఎప్పుడూ ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతారు. అందరితో చాలా సులభంగా కలిసిపోతారు.
గ్లాస్‌ను అడుగు నుంచి పట్టుకునేవారు. వీరు విశ్వసనీయత ఉన్నవారు. అంతే కాకుండా వీరు చాలా శాంతంగా ఉండటారు. స్నేహానికి ఎక్కువ వలువను ఇస్తారు. ఎప్పుడైనా సరే మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దానిని పూర్తి చేయకుండా వదిలిపెట్టరు. కుటుంబానికి ఎక్కువ గౌరవం ఇస్తారు. ఆనందంగా గడుపుతారు.
కొంత మంది చిటికెన వేలుపైకి ఉంచి గ్లాస్ పట్టుకుంటారు. ముఖ్యంగా వైన్, లేదా టీ కప్పు , నీళ్లు తాగే సమయంలో ఇలా పట్టుకుంటారు. అయితే ఇలా చిటికెన వేలు పైకి పెట్టి గ్లాస్ పట్టుకునే వారు చాలా నిశ్శబ్దంగా ఉండే స్వభావం కలిగి ఉంటారంట. అంతే కాకుండా వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా వీరికి ఓర్పు , సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా పై స్థాయిలో ఉంటారు.




