Reading Time: < 1 minute
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నల్ల టీషర్టులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్‌ నేతలు దీంతో.. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అయితే టీషర్ల్స్‌ విప్పి లోపలికి వెళ్తామని మాజీ మంత్రి హరీష్‌ రావు.. తదితల నేతలు టీషర్లులు తీసేశారు. బనియన్ పైనే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రస్తుతం అసెంబ్లీ వద్ద తీవ్ర గందరళగోళం నెలకొంది.

అయితే పోలీసులు, BRS సభ్యుల మధ్య జరిగిన లోపులాటలో మాజీ మంత్రి కేటీఆర్, జగదీష్‌రెడ్డి స్వల్పగాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ప్లకార్డులు లేకుండా లోపలికి వెళ్లినా పోలీసులు ఇష్టానుసారంగా తోసేశారని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఈ తోపులాటలో తన కాలికి కూడా గాయమైందని.. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె అన్నారు.. మనుపెన్నడూ ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

వీడియో చూడండి..



మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.