Reading Time: < 1 minute

ఉక్రెయిన్కు క్షిపణుల కొరత ..1970 నాటి పాత వెపన్తో రష్యా డ్రోన్లపై అటాక్

Caption of Image.
  • మిగ్-29 జెట్లలో ఆర్-60 మిస్సైల్స్​ వాడకం

కీవ్ : ఉక్రెయిన్‌‌కు క్షిపణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రష్యా ప్రయోగిస్తున్న అధునాతన, వేగవంతమైన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఏకంగా 1970ల నాటి పాతకాలపు ‘ఆర్-60’ క్షిపణులను రంగంలోకి దించాయి. మిగ్-29 యుద్ధ విమానాలకు వీటిని అమర్చి దాడులను తిప్పికొడుతున్నాయి. రష్యా గంటకు 700 కి.మీ వేగంతో దూసుకువచ్చే గెరాన్-3, 4, 5 డ్రోన్లు, బండెరోల్ క్షిపణుల వినియోగాన్ని భారీగా పెంచింది. జులైలో 1,500, ఆగస్టులో 2,500 డ్రోన్లను ప్రయోగించడంతో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని కూల్చలేక తంటాలు పడుతున్నాయి.

జులైలో డ్రోన్ల కూల్చివేత (ఇంటర్‌‌సెప్షన్) రేటు 50 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఇది 60 నుంచి -70 శాతానికి మెరుగుపడినప్పటికీ, గతంలో నెమ్మదైన డ్రోన్లపై సాధించిన 90 శాతం విజయాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ‘రాండ్ కార్పొరేషన్’ అనలిస్ట్ మైఖేల్ బోహ్నైర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ వద్ద ఉన్న ఎఫ్-16 జెట్లకు వాడే ఏఐఎం-120, ఏఐఎం-9 మిస్సైళ్ల నిల్వలు కూడా అడుగంటాయి. నాసామ్స్ గగనతల రక్షణ వ్యవస్థలకు కూడా అవే వాడుతుండడంతో, పైలట్లు వీటిని రేషనింగ్ పద్ధతిలో వాడుతున్నారు. కొన్నిసార్లు విమానంలోని అంతర్గత గన్‌‌తోనే మిషన్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.