Reading Time: 2 minutes
బంగారం, వెండి కొనేవారికి శుభవార్త.. మళ్లీ తగ్గుతున్న ధరలు.. హైదరాబాద్‌తో తులం ఎంతంటే?

బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్లిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఒకనొక సమయంలో తులం బంగారం ధర రూ.2లక్షలకు చేరుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. దీంతో గత రెండు మూడు రోజులుగా ఈ ఆభరణాల ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరగమే అంటున్నారు విశ్లేషకులు..

సాధారణంగా ఈ వడ్డీ రేట్లు పెంచినప్పుడు లేదా యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు పెరిగితే పెట్టుబడి దారులు గోల్డ్‌కు బదులుగా వడ్డీనిచ్చే గవర్నమెంట్ బాండ్లలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. అందుకే గోల్డ్‌పై పెట్టుబడులు తగ్గి ధరలు కూడా దిగివస్తాయి. ఈ తగ్గుదల తర్వాత ప్రస్తుతం అంటే సెప్టెంబర్ 7వ తేదీన సోమవారం హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,790 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,890గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,890గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.
  • విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.
  • ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.
  • బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,790 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,890 వద్ద ట్రేడవుతోంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,600గా ఉన్నాయి.
  • దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,940గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,040 వద్ద కొనసాగుతోంది

దేశ వ్యాప్తంగా వెండి ధరలు

హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,54,800 వద్ద కొనసాగుతోండగా దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రైడువుతోంది. అలాగే ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణె నగరాల్లో సైతం కేజీ వెండి ధర రూ. 2,49,900 వద్దే ట్రేడవుతుంది.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.