
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తూనే అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అసెంబ్లీ గేట్ దగ్గర పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు బ్లాక్ డ్రెస్ ధరించారు. నల్లరంగు బట్టలకు అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపైకి పాడి కౌసిక్ రెడ్డి దూసుకెళ్లారు. బారికేడ్లను నెట్టుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. చొక్కా విప్పి నిరసన తెలిపిన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోలీస్ సిబ్బంది కాలర్ పట్టుకున్నారు. ఇదేం పాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.