July 15, 2026

Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
Reading Time: 2 minutes
Jana Nayagan Title Card Viral Vijay Honourable Cm Of Tamil Nadu

Jana Nayagan: తమిళనాడు రాజకీయ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, తన రాజకీయ అరంగేట్రంతోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత విజయ్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించారు. తాజాగా థియేటర్లలో ప్రత్యక్షమైన ‘జననాయగన్’ చిత్రానికి సంబంధించిన కొత్త టైటిల్ కార్డ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఆ టైటిల్ కార్డ్‌లో ఏముందంటే..
సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. జననాయగన్ సినిమాలో విజయ్ పేరుకు ముందు “తమిళనాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్” (Honourable Chief Minister of Tamil Nadu C. Joseph Vijay) అని ప్రదర్శించారు. భారతదేశ సినీ చరిత్రలో ఒక నటుడికి ‘ముఖ్యమంత్రి’ అనే ట్యాగ్‌తో టైటిల్ కార్డ్ పడటం ఇదే తొలిసారి అని విజయ్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఫ్యాన్స్ థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. డ్యాన్సులతో, కేకలతో సినిమా హాళ్లు హోరెత్తిపోతున్నాయి.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, విజయ్ రాజకీయ హోదాను సినిమాలో కూడా ప్రతిబింబించాలని అభిమానులు కోరారు. వారి కోరిక మేరకే మేకర్స్ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి జనవరి 9న విడుదల కావాల్సింది. అయితే చిత్రంలో రాజకీయ పరమైన అంశాలు ఎక్కువగా ఉండటం, మార్చి 15 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలనకు పంపింది. దీనివల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ కెరీర్‌లో ఇదే ఆఖరి సినిమా అని ప్రచారం జరుగుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ ఘనవిజయంపై కేవీఎన్ నిర్మాణ సంస్థ అధినేత వెంకట్ స్పందిస్తూ.. “ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మా ‘జననాయగన్’ విజయ్ సర్‌కు అభినందనలు. ఇది ఒక విప్లవం, తరతరాల పాటు ఈ విజయం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ‘సీఎం’ టైటిల్ కార్డ్ వీడియో తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతోంది.