
ముంబై: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ టైటిల్స్ తీసుకోవడానికి భారత మహిళల, పురుష జట్లు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు భారత్కు ట్రోఫీలు అందలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టైటిల్స్ వివాదంపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
పురుషుల, మహిళల ఆసియా కప్ ట్రోఫీలు రెండూ తప్పకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్న బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి చేరుతాయని హామీ ఇచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్ 18) ముంబైలో బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జరిగింది.
ఈ మీటింగ్ అనంతరం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. పురుషుల, మహిళల ఆసియా కప్ ట్రోఫీలు భారత్కు వచ్చి తీరుతాయని పేర్కొన్నారు. అయితే, ట్రోఫీలు ఎప్పుడూ ఇండియాకు వస్తాయనే దానిపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ట్రోఫీలు మాత్రం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి చేరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.
►ALSO READ | దుమ్మురేపిన సెహ్వాగ్, ద్రావిడ్ కుమారులు.. ఆస్ట్రేలియాU19 జట్టుపై ఇండియాU19 ఘన విజయం
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన మెన్స్ ఆసియా కప్ టైటిల్ విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే, 2025, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ సేన నిరాకరించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన మహిళల ఆసియా కప్ టోర్నీ విజేతగా హార్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా ఉమెన్స్ టీమ్ నిలిచింది. ఉమెన్స్ టీమ్ కూడా పురుషుల జట్టు బాటలోనే నడిచింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు హార్మన్ సేన ససేమిరా అంది. దీంతో మెన్స్, ఉమెన్స్ రెండు ట్రోఫీలు ఏసీసీ దగ్గరే ఉండిపోయాయి.