Reading Time: < 1 minute

2029లో జగన్ సీఎం, నేను మంత్రి.. చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి బొత్స 

Caption of Image.

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో తాను చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని… జగనే సీఎం అవుతారని, తాను మంత్రి అవుతానని అన్నారు బొత్స. శుక్రవారం ( సెప్టెంబర్ 18 ) చీపురుపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఇటీవల తన ఆరోగ్యం బాగాలేదని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కొంతమంది అనుకుంటున్నారని.. చీపురుపల్లి నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 1996లో ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఎలాగైతే కార్యకర్తలతో మమేకమై ఉన్నానో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో గెలిచి తాను మంత్రి అయితే… ప్రతి కార్యకర్త మంత్రి అయినట్లేనని అన్నారు బొత్స. గతంలో ఒకడే అనుసంధాన కర్త ఉండేవాడని.. ఇప్పుడు ప్రతి కార్యకర్త అనుసంధాన కర్తేనని అన్నారు.

►ALSO READ | అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు… విచారణకు రావాలంటూ ఫోన్ ద్వారా సమాచారం..

స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని… ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను జనాలకు తెలిసేలా చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతల అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని అన్నారు బొత్స. 
 

©️ VIL Media Pvt Ltd.