Reading Time: < 1 minute

బీటెక్ చేసి జాబ్ ప్రయత్నాల్లో ఉన్నారా..? TGPSC జాబ్ నోటిఫికేషన్.. స్టార్టింగ్ శాలరీ 50 వేలకు పైనే..

Caption of Image.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB)లో 130 మేనేజర్ల (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండే దరఖాస్తు ఫారం నింపి ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ ఉద్యోగాలకు వయో పరిమితి 18 నుంచి 44 సంవత్సరాలు. మల్టీ జోన్ II క్యాడర్ పోస్టులు. పే స్కేల్ 54,220-1,33,630. అప్లికేషన్లు సెప్టెంబర్ 23 నుంచి పంపించవచ్చు. అక్టోబర్ 17 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించాలి. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో 7 వేల 437 పోలీస్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల తేదీలను TSLPRB (తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్) ఖరారు చేసిన సంగతి తెలిసిందే. SI అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించాలని TSLPRB నిర్ణయించింది.

►ALSO READ | ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదివేవారికి గుడ్ న్యూస్:DRDO Jobs..పెయిడ్ ఇంటర్న్..

©️ VIL Media Pvt Ltd.